సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో వరుణ మంత్ర జపం
భీమవరం, మేజర్ న్యూస్: సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని సత్సంకల్పంతో భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం మూడు రోజుల వరుణ మంత్ర జపం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వరుణ మంత్ర జపం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ రాజ్యసభ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ తోట సీతామహాలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, ఆలయ చైర్మన్ బోండాడ నాగభూషణం, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు వరుణ మంత్ర జపం కొనసాగనుంది.
రిపోర్టర్:- శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా