BREAKING
జన్మదిన వేడుకల్లో యాదాల సాయి కిరణ్ సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు ! దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్ల వేట.. 100 మందికి పైగా అరెస్ట్

ఇరవై ఒకటో రోజుకు చేరి కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

Select Suryaa Now
ఇరవై ఒకటో రోజుకు చేరి కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ప్రభుత్వం  తమ న్యాయమైన కోర్కెలను ఆమోదించాలని కోరుతూఆత్మకూరులో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళ వారానికి  21వ రోజుకు చేరుకొని కొనసాగుతోంది. వారంతా మండల రెవెన్యూ కార్యాలయంలో శిభిరంలో బైటాయించి రిలే దీక్షలు చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు.అనాదిగా తాము అరకొర వేతనంతో పూర్తి సమయం కేటాయించి విధులు నిర్వహిస్తూ కుటుంబాలు పోషించుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వారు పేర్కొన్నారు. ఎన్ని విన్నపాలు చేసినా,ఆందోళనలు చేసినా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తదితరాలతో తమ కుటుంబ పోషణ అత్యంత భారంగా మారిందని వారు పేర్కొన్నారు. వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, వన్ టైం సెటిల్మెంట్ గా ఒకే దపాగా అర్హత గల వారికి విఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలు గా పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని వారు ముక్త కంఠంతో కోరారు. ప్రభుత్వం తమ దయనీయ పరిస్థితి ని గమనించి కనికరించాలని వారు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘ రాష్ట్రకోశాధికారి హాజరత్తయ్య, మండల అధ్యక్షుడు సుదర్శన్,మండల ఉపాధ్యక్షులు అంకయ్య, ఖదీర్,నారాయణ, నాయకులు విష్ణు,షకీలా, అనురాధ, హైమావతి, ప్రసాద్, మండలంలోని పలువురు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.