BREAKING
గ్లోబల్ మార్కెట్లలో సరికొత్త జోరు... బలమైన ట్రెండ్‌లో వాల్‌స్ట్రీట్ సూచీలు జన్మదిన వేడుకల్లో యాదాల సాయి కిరణ్ సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు !

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Select Suryaa Now
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

పుల్లలచెరువు మేజర్ న్యూస్

మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పుల్లలచెరువు ఎస్సై బి. సాంబశివరావు హెచ్చరించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా పోలీసు శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని తెలిపారు.మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్సై పేర్కొన్నారు. గ్రామాల్లో గొడవలు, వివాదాలు సృష్టించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి వాటిని ఉపేక్షించబోమన్నారు.
ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా ఏదైనా సమస్య తలెత్తితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా వ్యక్తిగత వివాదాలను ఘర్షణలకు దారితీయకుండా చట్టపరమైన మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. సోషల్‌ మీడియాలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు,  అసత్య ప్రచారాలు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై బి. సాంబశివరావు కోరారు. శాంతికి భంగం కలిగించే వ్యక్తుల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.