BREAKING
గ్లోబల్ మార్కెట్లలో సరికొత్త జోరు... బలమైన ట్రెండ్‌లో వాల్‌స్ట్రీట్ సూచీలు జన్మదిన వేడుకల్లో యాదాల సాయి కిరణ్ సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు !

స్మశానాన్ని ఆక్రమించుకుంటున్నారని ఆర్డీవో, తాహసిల్దార్ ను ఆశ్రయించిన మహిమలూరు గ్రామస్తులు

Select Suryaa Now
స్మశానాన్ని ఆక్రమించుకుంటున్నారని ఆర్డీవో, తాహసిల్దార్ ను ఆశ్రయించిన మహిమలూరు గ్రామస్తులు

ఆత్మకూయు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలోని స్మశానాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని గ్రామానికి చెందిన చాకలి, ముదిరాజు, బలిజ, మంగలి కుటుంబాలకు చెందిన సుమారు 250 మంది మంగళవారం ఆత్మకూరు ఆర్డీవోను, తాహసిల్దార్ని కలిసి వినతి పత్రం అందించారు.. 1999లో తమకు గ్రామంలోని  575/2ఏ ,2బి  సర్వేనెంబర్ల లోని నాలుగున్నర ఎకరాల భూమిని గ్రామంలోని బలిజ, ముదురాజు, చాకలి, మంగలి కులాలకు చెందిన 300 కుటుంబాలకు స్మశానానికి కేటాయించారని, ఇటీవల కొందరు స్మశానంలోని కొంత స్థలాన్ని ఆక్రమించి స్వాధీన పరుచుకున్నారని వారు పేర్కొంటూ ఈ విషయమై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆత్మకూరు ఆర్డీవో బి.పావని కి , తాహసిల్దార్  పద్మజాకుమారికి వినతి పత్రాలు అందించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ స్మశానానికి కేటాయించిన ఈ స్థలంలో  కొందరు ఉద్దేశపూర్వకంగా ఆక్రమించుకుంటూ వారి స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఈ స్మశానాన్ని తమ గ్రామంలోని నాలుగు కులస్తులు ఉపయోగించే స్మశానమని దీనిని హద్దులు ఏర్పాటు చేసి ప్రహరి నిర్మించి తమకు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వేణు, రమణయ్య, పుల్లయ్య, వెంకటేశ్వర్లు, హరి తదితరులు పాల్గొన్నారు.