సీబీఎస్ షాపింగ్ మాల్ లో దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభం
సంగారెడ్డి లో సీబీఎస్ షాపింగ్ మాల్ లో దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభం
సినీనటి పాయల్ రాజపుత్ సందడి
అదిరిపోయే ఆఫర్స్ మరియు అదిరిపోయే బహుమతులు వచ్చే సంవత్సరం....
తెలంగాణ పండుగ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం... అందరి తో కలిసి బతుకమ్మ ఆడిన సినీనటి పాయల్....
సంగారెడ్డి ; సంగారెడ్డి లో సినీనటి *పాయల్ రాజపుత్* చేతుల మీదుగా ఘనంగా *దసరా డబుల్ ధమాకా సేల్* ప్రారంభించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి పాయల్ రాజపుత్ మాట్లాడుతూ.. సంగారెడ్డి కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్ కాస్ట్యూమ్స్ కోసం తాను సీబీఎస్‌లోనే షాపింగ్ చేస్తానని తెలిపారు. ఇక్కడ లభించే డిజైన్లు, వెరైటీలు ప్రత్యేకంగా ఉంటాయని, అందుకే సీబీఎస్ తనకు ఎంతో ఇష్టమైన షాపింగ్ డెస్టినేషన్‌గా మారిందన్నారు.సీబీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ *జానా సురేష్* మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుబంధంతో తమ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోందన్నారు. తాము ప్రారంభించిన ప్రతి షోరూంకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. సంగారెడ్డి ప్రజల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి షోరూంను తీర్చిదిద్దినట్లు ఇప్పుడు సంగారెడ్డి ప్రజల కోసం *దసరా డబుల్ ధమాకా సేల్* తీసుకొచ్చాము అని తెలిపారు.అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలతో పాటు ఆధునిక ఫ్యాషన్ దుస్తులను అందించడమే తమ లక్ష్యమన్నారు. అదే తమ విజయ రహస్యమని తెలిపారు. దసరా, దీపావళి పండుగలతో పాటు షోరూం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని *ప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు* అందిస్తున్నట్లు వెల్లడించారు.ప్రారంభోత్సవం సందర్భంగా షోరూంలో భారీగా కస్టమర్లు సందడి చేశారు. ముఖ్యంగా మహిళలు ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ చీరలు, ఇతర వస్త్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దీంతో షోరూం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.సీబీఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా డబుల్ ధమాకా సేల్” లో భాగంగా కస్టమర్లకు ఆకర్షణీయమైన ధరల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.