BREAKING
మమితా బైజు క్రేజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో గోల్డెన్ బ్యూటీ ఎంట్రీ! గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు! త్రిపురాంతకం సీఐగా బాధ్యతలు స్వీకరించిన మాతంగి శ్రీనివాసరావు రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'రణబాలి' నుంచి రెండో సింగిల్ వచ్చేసింది.. మ్యూజికల్ ట్రీట్‌తో అదరగొడుతున్న మేకర్స్! పేదలకు కొండంత అండ సీఎం సహాయనిది. 47,85,484 ప్రొఫైల్ చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ప్రతి గ్రామంలోనూ టీడీపీ జెండాను ఎగరవేయాలి.. టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు న్యాయ పరిశోధనలో అత్యున్నత శిఖరం! ప్రొఫెసర్ డాక్టర్ గంట సత్యనారాయణ ఢిల్లీ పోలీసులపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు బీసీల ఐక్యత విజయానికి సోపానం. దేవరయాంజాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి సీతక్క జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా హరిప్రసాద్. బీసీలు రాజకీయంగా ఎదగవద్దా..? స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నాగమల్లేశ్వరరావు.

ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు..

Select Suryaa Now
ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు..

ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు..

# విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి ప్రశంసనీయం.

# క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి


రేణిగుంట మేజర్ న్యూస్:  విద్యార్థులు క్రీడలను దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని  డాక్టర్ బషీర్ తపస్య పాఠశాల అధినేత విక్రమ్ శాలి,   తెలిపారు. కరస్పాండెంట్ విక్రమ్ శాలి మాట్లాడుతూ, నిరంతర సాధన, పట్టుదల ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని విద్యార్థులు తమ ఆటతీరుతో నిరూపించారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో తపస్యా క్రీడోత్సవం ఎంతగానో దోహదపడిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతర తపస్య  ట్రోఫీ ముగింపు వేడుకలో అనూషా  మాట్లాడుతూ, ట్రోఫీని కైవసం చేసుకునే ప్రయత్నంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చిన్నారులందరినీ అభినందించారు. తపస్య  క్రీడోత్సవాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన నిర్వాహకులు,  ఉపాధ్యాయులు, వివిధ క్రీడల శిక్షకులు, న్యాయ నిర్ణేతలకు   ధన్యవాదాలు తెలియజేశారు.  భీష్మ, ద్రోణ, కర్ణ, అర్జున సమూహాల్లోని విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్న తీరు తనకు మహాభారత కురుక్షేత్ర పోరాటాన్ని గుర్తుచేసిందని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ చిన్నారులను అభినందించారు.

 

రిపోర్టర్ :  రమేష్ బాబు కొండల