శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నాగమల్లేశ్వరరావు.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీషీటర్లు శాంతిభద్ర లకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దర్శి సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు. ముండ్లమూరు మండల పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ నాగమల్లేశ్వరరావు, ఎస్సై కోటేశ్వరరావు కౌన్సిలింగ్ నిర్వహించారు. షీట్ ఉన్న వ్యక్తులు ఎలక్షన్ సమయంలో కానీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోయిన సమయంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ సృష్టించకుండా ఎటువంటి గొడవలలో ఇన్వాల్వ్ అవ్వకుండా సక్రమమైన మార్గంలో ఉండాలని రౌడీషీటర్ల ను హెచ్చరించారు.