బీసీలు రాజకీయంగా ఎదగవద్దా..?
సుప్రీం తీర్పు..బీసీల అభివృద్దికి అడ్డుకట్టే
స్థానిక సంస్థల 34% బీసీ రిజర్వేషన్ పై గందరగోళం
రాజ్యాంగ సవరణ చేసి..బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి
ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటే..చరిత్రలో నిలిచిపోవడం ఖాయం
13 బి.సి సంఘాల సమావేశంలో బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః స్వతంత్ర భారత దేశంలో బీసీల అభివృద్దికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడడం చాలా బాధకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యలు ఆర్.కృష్ణయ్య ఆవేధన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కాలంటే అందుకు రాజ్యంగ సవరణయే సమస్యలకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. ఆదివారం బషీర్‌బాగ్‌లో జరిగిన 13 బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. సుప్రీంకోర్టు నిన్న స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కొట్టు వేస్తూ తీర్పు ఇవ్వడం భాధాకరం. ఇది బీసీల ప్రజాస్వామ్య హక్కు కాలరాయడమే అవుతుంది, అసెంబ్లీలో చట్టం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం జనాభా లెక్కలు ఏశారు. గతంలో మూడు ఎన్నికలలో 34% అమలు చేశారు. బలమైన ప్రతిపాదకలలో అసెంబ్లీలో రిజర్వేషన్లు చట్టం చేశారు. అయినా ఇంత బలమైన ఆధారాలు యున్న సుప్రీంకోర్టు కొట్ట వేయడం చాలా బాధాకరం, సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లను కొట్టివేయడం ఒక సంప్రదాయంగా మారింది. కొట్టి వేయడం ప్యాషన్ గా తయారైంది. ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గానికి కులానికి వారి జనాభా ప్రకారం ఇవ్వడం ప్రజాస్వామ్య సిద్ధాంతం, ఎస్సీ/ఎస్టీలకు అగ్రకులాలకు కూడా జనాభా ప్రకారం ఇస్తూ బీసీలకు 50 శాతం పరిమితి విధిస్తూ 78 సంవత్సరాలుగా బి.సి.లకు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు విద్యా ఉద్యోగాలలో అన్యాయం చేస్తున్నారు. బీసీలు 56% జనాభా ఉంటే విద్యా, ఉద్యోగాలలో 25 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అన్యాయం చేస్తున్నారు ఇక రాజకీయ రిజర్వేషన్లు, చట్టసభలలో రిజర్వేషన్లు ఊసి లేదు. ఇంకా ఆర కొరగా స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లు ఇస్తుంటే దాన్ని కూడా ఓర్వవలేకపోతున్నారు. బీసీలు 56 శాతం జనాభా ఉంటే 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దీనిని కూడా కోర్టు కొట్టు వేయడం దుర్మార్గం. గత 15 సంవత్సరాలుగా హైకోర్టు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి దాటరాదంటూ కొట్టు వేయడం ఒక సంప్రదాయంగా మారింది. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాలలో కూడా 50 శాతం పరిమితి చూపిస్తూ బీసీ రిజర్వేషన్లను కొట్టివేశారు. 50శాతం గరిష్ట పరిమితి నిబంధన రాజ్యాంగంలో లేదు. ఏ చట్టంలో లేదు. ఒక బీసీ రిజర్వేషన్లకే ఎందుకని ప్రశ్నించారు. త్రిపుర, మేఘాలయ, మిజురం, నాగాలాండ్, అరుణాదాల ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాలలో ఎస్సీ/ఎస్టీలకు కలిపి 70 నుంచి 90% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కానీ బీసీల విషయానికొస్తే 50 శాతం పరిమితి చూపడం సరికాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచి అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలి. ఇక్కడ లోతుగా ఆలోచించాల్సిన రాజ్యాంగపరమైన కోణం ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితి దాటి రిజర్వేషన్లు అమలు చేయాలంటే లేదా ఆ సీలింగ్ పరిమితిని మార్చాలంటే పార్లమెంటులోని రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి ప్రధానమంత్రిని కలిసి చర్యలు జరిపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్ప ఎవరికి సాధ్యం కాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధానితో, కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయని, రాజ్యాంగ సవరణ చేయిస్తే చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని కృష్ణయ్య స్పష్టం చేశారు.