నూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొన్న ఐఏఎస్ అధికారి - ప్రత్యేక పూజలు నిర్వహించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కే చక్రధర రావు
గవరపాలెంలో కొలువుదీరిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల కు కే చక్రధర్ రావు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సోమవారం కుటుంబ సమేతంగా నూకాంబిక అమ్మవారి దేవాలయానికి దర్శనార్థం విచ్చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరరావు కుటుంబ సభ్యులకు సాదర స్వాగతం పలికారు.అనంతరం నూకాంబిక అమ్మవారి దేవస్థానం సిబ్బంది పూర్ణకుంభంతో చక్రధర్ కి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్తాల సమర్పించారు . శరన్నవరాత్రుల సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు అందచేశారు . అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీల నాగశీను, ఆలయ ఈవో వై. శ్రీధర్, ఆలయ డైరెక్టర్లు, కూటమి నాయకులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రవికుమార్
ఎన్ డి పి సూర్య ప్రతినిధి