రుషింగిలో దేవి ఆలయానికి భక్తుల తాకిడి
వంగర వంగర మండలం రుషింగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు
దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి మాలధారణ చేసిన భక్తులు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు.
అమ్మవారి అనుగ్రహం పొందాలని భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక భక్తిని చాటుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. దేవి నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.