BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

గురజాడ సొంతూరు ఎస్.రాయవరం హైస్కూల్ విద్యార్థుల అవస్థలపై...

Select Suryaa Now
గురజాడ సొంతూరు ఎస్.రాయవరం హైస్కూల్ విద్యార్థుల అవస్థలపై...

 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన సోమిరెడ్డి రాజు

అసంపూర్తి భవనంతో విద్యార్థుల అవస్థలు.. వరండాలోనే తరగతి గదులు!

ఎస్.రాయవరం, అక్టోబర్ 12, మేజర్ న్యూస్:
మండల కేంద్రం, మేజర్ పంచాయతీ అయిన ఎస్.రాయవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల అవస్థలు గురించి రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కు అందించిన విజ్ఞప్తి పత్రాన్ని సామాజిక కార్యకర్త సోమిరెడ్డి రాజు సోమవారం పత్రికల వారికి అందజేశారు.

మహాకవి గురజాడ వెంకట అప్పారావు జన్మస్థలంలో 1957లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 6 నుండి 10వ తరగతి వరకు 104 మంది బాలురు, 104 మంది బాలికలు మొత్తం 208 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్లో 8, 9, 10 తరగతులకు రెండేసి సెక్షన్లు, 6, 7 తరగతులకు ఒక్కో సెక్షన్ చొప్పున మొత్తం 8 సెక్షన్లు ఉండగా, అందుబాటులో ఉన్నది కేవలం 7 తరగతి గదులు మాత్రమే. దీంతో ఒక తరగతి వరండాలోనే నిర్వహిస్తున్నారు. ఉన్న గదులు కూడా పాత రేకుల షెడ్లలో, లైబ్రరీ సౌకర్యం లేకుండా అరకొర వసతులతో నడుస్తున్నాయి. వర్షానికి కారుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదేళ్లయినా నిర్మాణానికి నోచుకోని అదనపు తరగతి గది
విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి 2017 మార్చి 24 న అప్పటి సర్వశిక్షా అభియాన్ ద్వారా రూ 15.80 లక్షలతో ఒక అదనపు తరగతి గది నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. నిధులు అయితే వచ్చాయి కానీ, పదేళ్లయినా అదనపు తరగతి నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. అసంపూర్తి భవనం కారణంగా విద్యార్థులు పైకి, కిందకి ఎక్కి దిగేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

ప్రజా వేదికకు విజ్ఞప్తి చేసిన సోమిరెడ్డి రాజు!
ఈ విషయంపై సామాజిక కార్యకర్త, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా జనరల్ సెక్రటరీ సోమిరెడ్డి రాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసంపూర్తి భవనాన్ని తక్షణమే పూర్తి చేయాలని, పాత రేకుల షెడ్ల స్థానంలో కొత్త భవనాలు, లైబ్రరీ, మధ్యాహ్న భోజన వంట గదిని నిర్మించి, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. "విద్య అనేది దేవాలయం లాంటిది. ఆధునిక దేవాలయమైన పాఠశాలలో కనీస వసతులు లేకపోవడం బాధాకరం. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి" అని సోమిరెడ్డి రాజు ఆ విజ్ఞప్తిలో పేర్కొన్నారు.