BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

సీతంపేట మన్యం కొండ చీపుర్లకు విజయవాడ సరాసా ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక స్టాల్

Select Suryaa Now
సీతంపేట మన్యం కొండ చీపుర్లకు విజయవాడ సరాసా ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక స్టాల్

 

పదివేలు చీపుర్లు ఎగ్జిబిషన్ కి


పిఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్

సీతంపేట అక్టోబర్ 12మేజర్ న్యూస్


సీతంపేట మండలంలో రైతు భరోసా 
కేంద్రాలు ద్వారాగిరిజన మహిళారైతులతో తయారు చేయబడుతున్న మన్యం కొండ చీపుర్లకు విజయవాడలో 2026 అక్టోబర్ 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సరాసా ఎగ్జిబిషన్‌లో విక్రయాల నిమిత్తం పి డి డి ఆర్ డి ఏ పార్వతి పురం మన్యం జిల్లా  వారి ఆధ్వర్యం లో  ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా, గౌరవనీయులైన పి ఓ 
సీతంపేట వారు స్వయంగా కొండ చీపుర్ల నాణ్యతను పరిశీలించడంతో పాటు, 
ఐటీడీఏ ప్రత్యేక కమిటీ ద్వారా నాణ్యతా తనిఖీలు నిర్వహించి, ఆమోదం పొందిన అనంతరం 10,000 మన్యం కొండ చీపుర్లను సరఫరా చేయవలసిందిగా సూచించడం జరిగింది.
ఈ ప్రదర్శన ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వినియోగదారులకు మన్యం కొండ చీపుర్లను పరిచయం చేయడంతో పాటు, వాటి మార్కెటింగ్‌కు విస్తృత అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఎఫ్ పి ఓ 
ద్వారా అనుబంధమైన  గిరిజన మహిళా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడమే కాకుండా, వారి ఉత్పత్తులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
గిరిజన మహిళా రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, స్థానికంగా తయారయ్యే మన్యం కొండ చీపుర్లకు గుర్తింపు తీసుకురావడం, మహిళా రైతులు/స్వయశక్తి సభ్యులు ఆదాయాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమంలో ఈ ఈ రమాదేవి, ఏ పి ఓ చిన్నబాబు, వెలుగు డి పి ఎం ఆర్ వి రమణ, ఏ పి  ఎం   కమలకుమారి, స్వయంశక్తి సంఘాలు సభ్యులు తదితలు పాల్గొన్నారు.