అడ్డరోడ్డు ఆర్డీఓ కార్యాలయానికి ఆరు పీజీఆర్ఎస్ వినతులు!
ఎస్.రాయవరం,ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ లోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి మొత్తం ఆరు వినతులు అందాయని కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ నానాజీ తెలియజేశారు. అందిన వినతులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.