BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు

స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు
- తమిరిశలో వైసీపీ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ
- కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: సీనియర్ నాయకులు

నందివాడ, సూర్య ప్రతినిధి : పార్టీ ఆవిర్భావం నుండి జెండా మోస్తూ, నిరంతరం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, వారికి పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా నిలుస్తుందని పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, నందివాడ మండల మాజీ ఎంపీపీ పెయ్యల ఆదాము, జిల్లా జనరల్ సెక్రటరీ కందుల నాగరాజు స్పష్టం చేశారు. నందివాడ మండలం తమిరిశ గ్రామంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ.. పార్టీ ప్రారంభ రోజుల నుండి కష్టకాలంలో కూడా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తల సేవలు అమూల్యమైనవన్నారు. కార్యకర్తలు ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ పెయ్యల ఆదాము, కందుల నాగరాజు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో ప్రజలతో మమేకం కావాలన్నారు. ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని, కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వారి సేవలను వైఎస్సార్‌సీపీ ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు. ఈ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలకు నాయకులు చేతుల మీదుగా ఐడీ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిరిశ గ్రామ నాయకులు తప్పిట సాలోమన్, కొండపల్లి రంగారెడ్డి, గుల్లపూడి చంద్రశేఖర్, మలిరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నందివాడ - సూర్య ప్రతినిధి (పాల్)