BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

బీసీల ఐక్యత విజయానికి సోపానం.

Select Suryaa Now
బీసీల ఐక్యత విజయానికి సోపానం.

బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత టిడిపి దే.

దర్శి నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు అవ్వాలి.

బిసి లకు రాజ్యాధికారం కల్పించమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.*

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తాం .

మున్సిపాలిటీ గెలిచి చంద్రబాబు కు గిఫ్ట్ ఇద్దాం.

డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

సూర్య న్యూస్ దర్శి. 

జయహో బిసి నినాదం కాదని టిడిపి ప్రధానమని స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పుతో వైసీపీ కనుమరుగు అవ్వాలని, బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో వైఎస్సార్‌సీపీ అనుసరించిన వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం దర్శి టిడిపి కార్యాలయం లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం పై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషిని వివరించడంతోపాటు, ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ వైఖరిని ఎండగడుతూ సమావేశంలో చర్చించారు. డాక్టర్ లక్ష్మి.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూబీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం, నాయకత్వ అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని తొలుత గుర్తించిన పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రాజకీయాల్లో ఎదిగి నాయకులుగా మారినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. తొలుత 20 శాతంగా ఉన్న రిజర్వేషన్లను క్రమంగా పెంచుకుంటూ వచ్చారని, ప్రస్తుతం 34 శాతం రిజర్వేషన్ల దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా, నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని, ఎన్టీఆర్‌ కులాల మధ్య విభజన రాజకీయాలకు భిన్నంగా సామాజిక సమానత్వానికి ప్రాధాన్యమిచ్చారని, చంద్రబాబు నాయుడు సైతం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. యువతకు, వెనుకబడిన వర్గాలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా అనేక మంది నాయకులను తయారు చేసిన రాజకీయ వేదికగా టీడీపీ నిలిచిందన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తోందని  గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. సుప్రీంకోర్టులో 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు ఉన్నప్పటికీ, బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు
దర్శి నియోజకవర్గం లోని 5మండల టిడిపి అధ్యక్షులలో 3మండలు టిడిపి అధ్యక్షులు గా ప్రకటించి బిసి లు అంటే తెలుగుదేశం పార్టీ అని నిరూపించామని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని, దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి రాజకీయంగా స్థానం లేకుండా చేసే దిశగా కూటమి శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన సందర్బంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని బిసి సోదరులు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమం లో దర్శి, దొనకొండ, కురుచేడు మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, పిడతల నేమిలయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ కోడిగా మస్తాన్ రావు, జిల్లా టిడిపి కార్యవర్గ సభ్యులు గడ్డం బాలయ్య, పఠాన్ సుభాని, వల్లెపు నారాయణ, మోడీ వెంకటేశ్వర్లు, డా. షేక్ సునీల్, రమణా యాదవ్, దర్శి మండల బిసి అధ్యక్షులు మేకబోయిన సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, పిన్నిక రమేష్, షేక్ అల్లాభక్ష, కౌన్సిలర్ రాంగిరి నియోజకవర్గం లోని బిసి సోదరులు పాల్గొన్నారు.