హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం
పులివెందుల మేజర్ న్యూస్:
హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పులివెందుల డిఎస్పి మురళి నాయక్ తెలిపారు. శనివారం స్థానిక గ్రామీణ సీఐ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 2వ తేదీ రాత్రి లింగాల మండలం మురారి చింతల గ్రామానికి చెందిన రాజును అతని అల్లుడు లింగాల సుదీర్ స్నేహితుడు దిలీప్ తో కలిసి హత్య చేయడం జరిగింది అన్నారు. రెండు సంవత్సరాల క్రితం రాజు కుమార్తె విజయను వేంపల్లి కి చెందిన సుధీర్ కు ఇచ్చి వివాహం చేశారు. భార్యాభర్తల మధ్య వివాదాలు రావడంతో కుమార్తె ఇంటికి రావడం జరిగింది. రెండో తేదీ రాత్రి మురారి చింతలకు వెళ్లి తన భార్యను పంపించాలని అడగడంతో పొద్దున మాట్లాడుదాము పొమ్మని చెప్పడంతో సుధీర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడవడంతో రాజు అక్కడికక్కడే మరణించడం జరిగింది అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు లింగాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. గ్రామీణ సీఐ శాంతి లాల్ కు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం అంబకపల్లి దగ్గర నిందితులు ఉన్నారన్న సమాచారం తో లింగాల ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి , పోలీస్ సిబ్బందితో కలిసి ఇద్దరినీ అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారిని విచారించగా నాటు తుపాకీని జంతువుల వేట కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై కూడా కేసు నమోదు చేసి ఈ సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సీఐ శాంతి లాల్, లింగాల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, తొండూరు ఎస్సై శివనాగిరెడ్డి ,
సింహాద్రిపురం ఎస్సై మద్దిలేటి పాల్గొన్నారు.
పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా