BREAKING
కర్రోతు ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్ కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో విద్యుత్ అంతరాయం. ఓటర్లకు తప్పని ఇబ్బందులు గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో భారీగా మోహరించిన పోలీసు పథకాలు. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి... - ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మత్స్య సహకార సంఘం నాయకులు పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదుల సంచారం.. షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తే అది అప్పగింత అభ్యర్థనకు వేరు:భారత్ స్పష్టీకరణ.. జర్మనీలో సహజ వాయువు నిల్వల పెంపునకు యూనిపర్ రూ. 1,100 కోట్ల పెట్టుబడి: ఎయిర్ ఇండియా–ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల్లో భారీ మార్పులు: డాయిష్ బ్యాంక్–పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ఒప్పందం: జర్మనీ రక్షణ సంస్థ హెల్సింగ్ భారీ కొనుగోలుకు సిద్ధం: స్పెయిన్ రక్షణ సంస్థ ఇండ్రా భారీ లక్ష్యం.. 2030 నాటికి 12 బిలియన్ యూరోల ఆదాయం: అమెరికా, చైనాకు పోటీగా యూరప్ భారీ సాంకేతిక పెట్టుబడి నిధి :

నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు-

Select Suryaa Now
నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు-

ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు:సిఎస్ పురం,మేజర్ న్యూస్: విజయదశమి పండుగను పురస్కరించుకుని నేడు అనగా ఆదివారం నుండి ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోనలో దసరా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు భక్తులు పర్యాటకులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భైరవకోన ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు తెలిపారు. ఈసందర్భంగా ట్రస్టుబోర్డు చైర్మన్  మాట్లాడుతూ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సహకారంతో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి డి.వంశీకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం ఉదయం శ్రీత్రిముఖ దుగ్గభర్గులేశ్వరస్వామి కాలభైరవేశ్వరస్వామి నగరేశ్వరస్వామి ఇతర శివలింగాలకు అభిషేకం కుంకుమార్చన పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన మండపం నందు శ్రీత్రిముఖ దుర్గాదేవిని అలంకరణ చేసి గణపతి పూజ,వివిధ పూజలు నిర్వహించి అనంతరం ఉభయదాతలచే అర్చకులు వేదపండితులు హోమపూజలు నిర్వహించి లఘు పూర్ణాహుతి తదుపరి నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేస్తున్నట్లు అదేవిధంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రతిరోజూ విశేష అలంకరణ చేయనున్నట్లు తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకరణలు చేసి దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు భక్తులు పర్యాటకులు అధికసంఖ్యలో పాల్గొని దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారు స్వామివార్ల ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు తెలిపారు.