రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా ఆడిపాడిన మున్నూరుకాపు సంఘం మహిళలు
రవీంద్రభారతి, అక్టోబరు 13 ): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలు రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా సాగాయి. ఈ వేడుకల్లో బండి పద్మ నేతృత్వంలోని మున్నూరు కాపు సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. కార్యక్రమానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాల కులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ పండుగ విశిష్టతను కొనియాడారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ అన్నారు. పూలను ప్రేమించే పండుగగా తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం నేతలు రజనీకాంత్ సంగాని, కొత్త లక్ష్మణ్ పటేల్, మురళి, ఆర్వీ మహేందర్, పెరికె రమేష్ పటేల్, పోతిరెడ్డి సందీప్, తులసి అరుణ, తులసి, షర్మిల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు