BREAKING
నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్!

రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి - పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

Select Suryaa Now
రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి - పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
రైస్ మిల్లర్లకు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచన - కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరిక.
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు సామాన్య ప్రజలకు బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా రైస్ మిల్లర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, రవాణా, విక్రయాల విషయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ధాన్యాన్ని అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించడం, కృత్రిమ కొరత సృష్టించే చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రైస్ మిల్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లు, విక్రయాలు, బియ్యం సరఫరా తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
...రైతుల ప్రయోజనాలే ప్రాధాన్యం.
   ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పంటల సాగు, దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లు, విక్రయాల్లో అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధిక ధరల కోసం ఇతర ప్రాంతాలకు తరలించడం, మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు.    ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు, వర్తించే ధరల మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని రైస్ మిల్లర్లకు సీపీ సూచించారు. ప్రజలకు అవసరమైన బియ్యం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా సహకరించాలని ఆయన కోరారు.
...సమన్వయంతో సరఫరా వ్యవస్థ నిర్వహణ.
    రైతుల కష్టాన్ని గుర్తించి వారి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందేలా రైస్ మిల్లర్లు, అసోసియేషన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పి. సాయి చైతన్య పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, రవాణా, విక్రయాల విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖల నిబంధనలను పాటించాలని ఆయన చెప్పారు.   రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, ధాన్యం, బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత వర్గాలు సహకరించాలని సీపీ పిలుపునిచ్చారు.
   ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం. శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బి. ప్రవీణ్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేశం, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.