రామేశ్వర పల్లి గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి.
సూర్య కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని స్థానిక రెండో వార్డు డబుల్ బెడ్ రూమ్ వెనకాల రేణుక ఎల్లమ్మ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నివాసము అంటున్నటువంటి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీరు పేదలకు కనీసం ఇల్లు కట్టుకోవడానికి సెంటు భూమి ఇవ్వకుండా ఈరోజు బంధాల ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతున్న గాని పట్టించుకోవడంలేదని పేదలకు మాత్రం గుడిసె కోసం బతకడానికి జీవనోపాధి లేక గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి కూలిన అలీ పనులు చేసుకుంటున్నటువంటి పేదలకు ఇల్లు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే 12 సంవత్సరాల పైబడి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నటువంటి వాళ్లకి పట్టాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమైన వార్త అని అన్నారు ఇకనైనా ప్రభుత్వ అధికారులు నిరుపేదలు నివసిస్తున్న స్థలాల్లో పక్క ఇల్లు నిర్మించి పట్టాలు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో జబ్బర్ నాయక్ రాజయ్య స్వామి సత్యం సునీత అర్చన రాజమణి ఆత్మ రజిత కొమరవ్వ శోభ తో పాటు తదితరులు పాల్గొన్నారు