రాహుల్ గాంధీ కి మద్దతుగా సంగారెడ్డి లో జగ్గారెడ్డి ‘సేవ్ అవర్ ఓట్స్’ అనే వినూత్న కార్యక్రమం..*
*రాహుల్ గాంధీ కి మద్దతుగా సంగారెడ్డి లో జగ్గారెడ్డి ‘సేవ్ అవర్ ఓట్స్’ అనే వినూత్న కార్యక్రమం..*
*జగ్గారెడ్డి ఆధ్వర్యం లో సంగారెడ్డిలో బ్యాలెట్ బాక్స్ ఉద్యమం*
*ఓటర్ల పేర్లు, బూత్ నంబర్లు, సందేశాలతో బ్యాలెట్ బాక్స్‌లో వినతులు.. ఓటు హక్కు పరిరక్షణ పోరాటానికి సంఘీభావం*
*ఓట్ చోరీకి పాల్పడుతున్న కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి*
*కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి*
*రాహుల్ గాంధీ ని ఇదే విషయం లో రాష్ట్రపతి ని కలిశారు, ఆయనకు మద్దతుగా సంగారెడ్డి నుండి రాష్ట్రపతి కి ఓట్ కార్డు లు పంపిస్తున్నాను*
సంగారెడ్డి ; ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డిలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సేవ్ అవర్ ఓట్స్’ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్ బాక్స్ ద్వారా ప్రజలు తమ సంఘీభావాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో ప్రజలు తమ పేర్లు, పోలింగ్ బూత్ నంబర్లు రాసి, తమ ఓట్లను కాపాడాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తూ సందేశాలను బ్యాలెట్ బాక్స్‌లో వేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉన్నామని ఈ సందేశాల ద్వారా తెలియజేశారు.ఓటు హక్కు పరిరక్షణ అనేది కేవలం రాజకీయ నాయకులకు సంబంధించిన అంశం కాదని, ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించిన విషయమని ఈ కార్యక్రమం ద్వారా జగ్గారెడ్డి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి నేరుగా సందేశాలను సేకరించడం ద్వారా ఓటు హక్కుల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో మద్దతును కూడగట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ “ఓటు హక్కు పౌరుడి గొంతుక. ఆ ఓటును కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడంతో సమానం. సంగారెడ్డి ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీకి బలమైన సందేశాన్ని పంపించారు. ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న పోరాటంలో తామంతా భాగస్వాములమని చాటిచెప్పారు. ఇది ఒక్క నాయకుడి పోరాటం కాదు.. ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కును కాపాడుకునేందుకు సాగుతున్న సమష్టి పోరాటం.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ ఓటు హక్కుల పరిరక్షణ పోరాటానికి ప్రజల మద్దతును తెలియజేయడంతో పాటు, ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాల్సిన అవసరాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు.తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో 73 లక్షల ఓట్లను తొలగించారని, 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఓట్ల చోరీ కారణంగానే బీజేపీ ఎంపీలు గెలుస్తున్నారని, వారి మద్దతుతో మోడీ ప్రధాని అవుతున్నారని విమర్శించారు. ఇదే పద్ధతిలో నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.మోడీ, జ్ఞానేశ్ కుమార్ కలిసి ప్రజల ఓట్లను చోరీ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఓట్లను దొంగిలించే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశ పౌరుల హక్కులను, ముఖ్యంగా ఓటు హక్కును పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు.జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోనని రాహుల్ గాంధీ ప్రకటించారని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు చేస్తున్నారని, ఓటు హక్కు పరిరక్షణ అంశంపై రాష్ట్రపతిని కలవనున్నారని చెప్పారు. ఆయన పోరాటానికి సంఘీభావంగా సంగారెడ్డిలో నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. ప్రజల ఓటు హక్కును కాపాడాలి’’ అని డిమాండ్ చేశారు.