BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

పోషణ మాసం వేడుకలు

Select Suryaa Now
పోషణ మాసం వేడుకలు

మహాదేవపూర్ రైతు వేదికలో ఘనంగా ప్రాజెక్ట్ స్థాయి కార్యక్రమం
మహాదేవపూర్ ప్రతినిధి,
పోషణ మాసం పురస్కరించుకుని బుధవారం మహాదేవపూర్ రైతు వేదికలో ప్రాజెక్ట్ స్థాయి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, తల్లులు మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణపై విస్తృత అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, వ్యవసాయ కమిటీ చైర్మన్ తిరుమల హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజంలో ఆరోగ్యవంతమైన తరాన్ని తీర్చిదిద్దడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం సీడీపీఓ మరియు వైద్యాధికారులు మాట్లాడుతూ... ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు మరియు ఎదుగుతున్న పిల్లలు తీసుకోవాల్సిన సమతుల్యాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను లబ్ధిదారులు సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సర్పంచ్ హసీనా భాను, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, పలిమెల మండల ఎంఆర్‌ఓ , ఎంపీడీఓ , మెడికల్ ఆఫీసర్, అంగన్వాడీ సూపర్‌వైజర్లు, పోషణ అభియాన్ డీసీ , బీసీ , ప్రథమ్ మాస్టర్ ట్రైనర్, అంగన్‌వాడీ టీచర్లు, ఆయా హెల్పర్లు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.