BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

పిఆర్సి అమలులో జాప్యం జరిగితే పోరాటమే

Select Suryaa Now
పిఆర్సి అమలులో జాప్యం జరిగితే పోరాటమే

 

టిఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్..
కేసముద్రం,  రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ కేసముద్రం మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు భూక్య శ్రీను అధ్యక్షతన కేసముద్రం హైస్కూల్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ పాల్గొని మాట్లాడుతూ..ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు గా తక్షణమే పీఆర్సి రిపోర్ట్ తెప్పించుకుని జూలై 2023 నుండి పీఆర్సి అమలు చేయాలనీ అన్నారు. లేని యెడల దసరా తరువాత పోరాట కార్యాచరణ ప్రకటి స్తామని అన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు జరుపాలని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ఉన్న పాఠశాలలు మూసి వేసే ప్రయత్నాలు విరమిం చుకోవాలని, అవసర మున్న చోట మాత్రమే టీపీఎస్ లను ప్రారంభిం చాలని, ప్రాథమిక పాఠశాలలకు సహజ మరణం పొందేలా ఉన్న జీవో నంబర్ 25 ను సవరించాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు, 50 మంది విద్యార్థులున్న పాఠశాలలో తరగతికి ఒక టీచర్ను ఇవ్వాలని అన్నారు. ఉపాధ్యా యులచే పర్యవేక్షణ చేస్తున్న ప్యానల్ టీమ్స్ ను రద్దు చేసి పర్య వేక్షణ అధికారులను నియమించాలని అన్నారు. జీవో 317 లో నష్టపోయిన వారికీ కనీసం 190 జీవో నైనా అమలుచేయాలని అన్నారు. గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యా యులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమా వేశంలో జిల్లా కార్యదర్శి డి.హుస్సేన్, మండల ప్రధాన కార్యదర్శి కె. కళ్యాణ్, మండల కమిటీ సభ్యులు భద్రు, సూర్యనారాయణ, స్వప్న, భద్రాసింగ్, మధు, నాగరాజు, వెంకటరెడ్డి, హోంజీ తదితరులు పాల్గొన్నారు.