BREAKING
నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్!

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Select Suryaa Now
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

 

సింగిల్ విండో చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి

 *లింగారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఘనంగా..

 

నిరుపేదల సొంతింటి కలన కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని షాద్ నగర్ పిఎసిఎస్ చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  లింగారెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ఎండీ ఖదీర్ కుటుంబం తో కలిసి ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగిల్ విండో చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు.. 

అనంతరం చల్లా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. లింగారెడ్డిగూడ గ్రామంలో తొలి విడతలో 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో అనేక ఇళ్ల నిర్మాణాలు 80 శాతం వరకు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని వెల్లడించారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు లబ్ధిదారుడు ఎండీ ఖదీర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు ఎండీ మహారాజ్, గోద లక్ష్మయ్య యాదవ్, రంగంపల్లి శశాంక్ గౌడ్, వట్టెల మల్లేష్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ సందుగారి లక్ష్మీకాంత్ రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు రంగంపల్లి సురేష్ గౌడ్, పయ్యాల హరికృష్ణ యాదవ్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగంపల్లి రమేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచులు సందుగారి నరేందర్ రెడ్డి, కాటి మల్లేష్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు గోద రమేష్ యాదవ్, రంగంపల్లి శ్రీధర్ గౌడ్, రంగంపల్లి వీరేష్ గౌడ్, బాలానగర్ సురేష్ గౌడ్, షాబాద్ శంకరయ్య యాదవ్, ధనుల చందు యాదవ్, ఎర్రోళ్ల రామకృష్ణ, ఎర్రోళ్ల అరుణ్, బక్కని చిన్న నర్సింలు, చీపురు గణేష్ యాదవ్, పయ్యాల మల్లేష్ యాదవ్, ఎండీ మమ్మద్, షాబాద్ జంగయ్య యాదవ్, ఎండీ ఫరీద్, ఎండీ షరీఫ్, బీశ్వ యాదయ్య, సందుగారి భూపతి రెడ్డి తదితర గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. 

M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్….