కోరుట్లలో రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
సూర్య కోరుట్ల: పట్టణంలోని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ యూనిట్ ఆఫీసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని రికార్డులు, సంబంధిత దస్త్రాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.