కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు..!
ప్రజా పాలన మరింత మెరుగ్గా కొనసాగాలి.!
కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు..!
సంగారెడ్డి ; సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రజా పాలన మరింత మెరుగ్గా కొనసాగాలని టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) జర్నలిస్టులు ఆకాంక్షించారు. పేద బడుగు వర్గాల తో పాటు జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు.
టీయూడబ్ల్యూ జె - ఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను జర్నలిస్టులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుస్తకాలు, పెన్నులు అంద జేశారు. కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఏ అండ దండా లేని పేద ప్రజలకు పెద్దదిక్కుగా ఉండాలని కోరారు. అందుకు తగిన ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లాలో జర్నలిస్టులకు తోడుగా ఉండాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని పేర్కొన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ మనస్ఫూర్తిగా స్పందించారు. జిల్లా ఉపాధ్యక్షుడు మతిన్,
సీనియర్ జర్నలిస్టు మసూద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, చిన్న మధ్యతరహా పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, జర్నలిస్టులు సూర్య వెంకట్, దినేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.