జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
చుంచుపల్లి, సూర్య(మేజర్ న్యూస్) - మండలాపరిధిలో రుద్రంపూర్ లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. ఎస్ఏ-1 పరీక్షల చివరి రోజైనప్పటికీ విద్యార్థులు హుషారుగా పాల్గొని, రంగురంగుల బతుకమ్మలను పేర్చి పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా మార్చారు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి రజాక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బాలాజీ మాట్లాడుతూ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు.