BREAKING
ఆకాశాన్ని అంటుతున్న తున్న నిత్యవసర లు ధరలు అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు* *సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు

ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం మానుకోవాలి

Select Suryaa Now
ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం మానుకోవాలి

ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం మానుకోవాలి

 

దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలి.. ఆడబిడ్డలను రాజకీయాల్లోకి లాగొద్దు

మంచాల సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. ఎమ్మెల్యే బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బస్సు ఎక్కి ఇంజాపూర్ వరకు ప్రయాణిస్తూ మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థినితో ఎమ్మెల్యే మాట్లాడుతున్న వీడియోను వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునే హక్కు ఎమ్మెల్యేకు ఉందని పేర్కొన్నారు. మహిళలను గౌరవిస్తూ, ప్రజలతో ఆప్యాయంగా మెలిగే నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి అని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అయితే మహిళలను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేయడం తగదని హన్మంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో రైతుల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం ఆపకపోతే తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల