బొక్కివాగు కట్టపై రోడ్డు మరమ్మతులు
సూర్య, పెంచికల్‌పేట్:
పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్లూరు గ్రామం నుంచి మేరగూడ కాలనీ వరకు బొక్కివాగు కట్టపై ఉన్న రహదారికి సోమవారం మరమ్మతులు చేపట్టారు. గ్రామ ప్రజలకు రాకపోకలు సులభంగా ఉండేలా బ్లేడ్ బండితో రహదారిని సమతలీకరణ చేసి మరమ్మతు పనులు నిర్వహించినట్లు ఎల్లూరు గ్రామ సర్పంచ్ చప్పిడి రవీందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు శోభన్, సంతోష్, లచ్చన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.