BREAKING
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు సిఐ ని కలిసిన మండల టిడిపి అధ్యక్షులు. 2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కూటమి ప్రభుత్వం డ్రామాలు బట్టబయలు... మైత్రి లేఔట్ లో రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం వైయస్ మనోహర్ రెడ్డి

బీసీల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి

Select Suryaa Now
బీసీల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి
సూర్య, మంచిర్యాల: బీసీలకు సామాజిక న్యాయం, జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను పరిష్కరించాలంటూ శనివారం మంచిర్యాల పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసి, బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులు జరపాలని, బీసీలకు రోస్టర్‌ విధానం అమలు చేసి బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల రద్దు, జస్టిస్‌ రోహిణి కమిషన్‌ నివేదిక అమలు, బీపీ మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్‌, సీనియర్‌ న్యాయవాది కర్రె లచ్చన్న, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మంచర్ల సదానందం, శాఖపురం భీమసేన్‌, వేముల కిరణ్‌, గులాము హుస్సేన్‌, కొట్టే నటేశ్వర్‌, చలమల అంజయ్య, కీర్తి రవి, ఎండీ లతీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.