BREAKING
జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం కడప కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ

అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్

Select Suryaa Now
అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్

దుద్యాల్,మేజర్ న్యూస్:మండల పరిధిలోని హకీంపేట్,  పోలేపల్లి శివారులలో ఏర్పాటు అవుతున్న ఎడ్యుకేషన్ హబ్నిర్మాణాల పనులను మరియు దుద్యాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న మండల సమీకృత భవన నిర్మాణ పనులను సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి మంగళవారం పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన ఎడ్యుకేషన్ హబ్ ప్రాంతంలో గుట్టలు లేకుండా  సమాంతరంగా చేయాలని సూచించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ విద్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సదరు కాంట్రాక్టర్లకు సూచించాడు.  త్వరలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ అభివృద్ధి పనులను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భవనాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించాడు.  మండల సమీకృత భవన నిర్మాణం పూర్తి కావడం.. ప్రస్తుతం రంగులు అద్దుకుంటూ చివరి దశకు చేరుకుంది. దింతో అక్టోబర్ 10లోగా మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు.
ప్రత్యేక సమావేశం... ఎడ్యుకేషన్ హబ్ లో కొనసాగుతున్న నిర్మాణాల పట్ల అలసత్వం వహించకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మరియు సదర్ కాంట్రాక్టర్లకు
సీఎంఓ  ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి త్వరలో హకింపేటకు వచ్చే అవకాశం ఉండడంతో పనుల్లో వేగం పెంచి పురోగతిని పెంచాలని  సదరు కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్,  కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి,  ఎడ్యుకేషన్ ఆఫ్ అధికారులు స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.

రమేష్, దుద్యాల్ రిపోర్టర్, వికారాబాద్ జిల్లా.