5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు #. జోనల్ స్థాయి క్రీడా ఎంపికలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
నల్గొండ జిల్లా బ్యూరో మేజర్ న్యూస్...
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలో భాగంగా యాదాద్రి-5 జోన్ స్థాయి క్రీడా ఎంపికలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేయడమే ఈ జోనల్ స్థాయి ఎంపికల ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో భాగంగా క్లస్టర్-D పోటీలు నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, క్లస్టర్-ఇ పోటీలు నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా వివిధ క్రీడాంశాల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన యాదాద్రి-5 జోనల్ స్థాయి ఎంపికల్లో పాల్గొన్న పోలీస్ క్రీడాకారుల ప్రతిభ, క్రీడా నైపుణ్యం, శారీరక సామర్థ్యం, ప్రదర్శన ఆధారంగా ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టారు. ఎంపికైన క్రీడాకారులు రానున్న రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సంతోష్, హరిబాబు, శ్రీను, పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు.