BREAKING
11వ ఆయుష్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ. జోధ్‌పూర్‌లో తరంగ్ శక్తి విన్యాసాలు: ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్లతో రంగంలోకి దిగుతున్న అమెరికా వైమానిక దళం తనకున్న మానసిక రుగ్మతపై స్పందించిన హీరో అశోక్ సెల్వన్.. భార్యకు పెట్టిన కండిషన్ అదే! నన్ను నమ్మి అభివృద్ధిని చూసి నావెంట నడవండి - ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వర్షాలకు నీటి మాయమైన ప్రొద్దుటూరు నేడు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకి అంతరాయం: మండల విద్యుత్ అధికారి నరేందర్ రెడ్డి మునుగోడు,మేజర్ న్యూస్: నిమ్స్‌ అధికారి లక్ష్మీభాస్కర్‌ ఆస్తులపై ఏసీబీ సోదాలు సంగాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి : సర్పంచ్ మమత వెంకటరెడ్డి సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబు! కర్ణాటకలో లోకాయుక్త మెరుపు దాడులు: భారీగా నగదు, బంగారం, 80 మద్యం బాటిళ్లు పట్టివేత.. అధికారుల అక్రమాస్తులు బట్టబయలు వర్షపు నీటికి అడ్డుకట్టగా అక్రమ కట్టడాలు డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు.. కమిషనర్ ఆదేశాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్టారెడ్డి. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ హిమాన్షు శుక్ల రాజమండ్రి రూ. 2 కోట్ల నగదు మాయం కేసులో కీలక మలుపు విశాఖలో డ్రైవర్ సాయిశివ అరెస్ట్.. రూ.1.61 కోట్లు రికవరీ గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

'మీకో దండం.. నా కాళ్లపై పడొద్దు'.. అభిమాని ప్రవర్తనపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం!

Select Suryaa Now
'మీకో దండం.. నా కాళ్లపై పడొద్దు'.. అభిమాని ప్రవర్తనపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ఒక సినిమా లాంచింగ్ ఈవెంట్‌లో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరైన సమయంలో ఒక అభిమాని ఒక్కసారిగా ఆయన కాళ్లకు నమస్కరించడానికి ప్రయత్నించాడు. అది చూసిన అనిల్ రావిపూడి వెంటనే స్పందిస్తూ.. 'నా కాళ్లపై ఎందుకు పడతారు?' అంటూ ఆ అభిమానిపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని వేడుకుంటూ అక్కడున్న వారందరికీ రెండు చేతులెత్తి దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమాల విషయానికి వస్తే, అనిల్ రావిపూడి ఈ ఏడాది 'మన శంకరవరప్రసాద్‌గారు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మరో భారీ ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలె మూవీ సెట్స్‌లో నటి కృతి శెట్టి జన్మదిన వేడుకలను కూడా చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. పండుగ వాతావరణంలో కుటుంబ సమేతంగా చూసేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.