వృద్ధులకు బట్టలు పంపిణీ
ఒంగోలు, మేజర్ న్యూస్ :
ఒంగోలులోని ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ చిలుకూరి జయలక్ష్మి 71 వ జన్మదినం సందర్భంగా సమతా మహిళా వృద్ధాశ్రమంలో చీరలు పంపిణీ చేశారు. శివప్రసాద్ కాలనీలో ఉన్న సమత మహిళా వృద్ధాశ్రమంలో 30 మందికి చీరలు, పండ్లు తో పాటు ఆశ్రమానికి కావాల్సిన ఫ్యాన్లు అందజేశారు. కాలేజీ కరస్పాండెంట్ జయలక్ష్మి పుట్టిన రోజు వేడుకలు ఆశ్రమంలోని వృద్దులతో కలిసి కాలేజీ సిబ్బంది చేశారు. మహిళా వృద్ధాశ్రమానికి తమ కాలేజీ తరపున అండగా ఉంటామని డైరెక్టర్ చిలుకూరి మల్లేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మోపర్తి లక్ష్మీనారాయణ, ఆశ్రమ నిర్వాహకులు అంకబాబు, మాలతి పాల్గొన్నారు.