BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

వీరవరం గడపగడపకు వైసీపీ ప్రచారం.. అభ్యర్థుల విజయానికి వేణు గోపాలకృష్ణ పిలుపు

Select Suryaa Now
వీరవరం గడపగడపకు వైసీపీ ప్రచారం..  అభ్యర్థుల విజయానికి వేణు గోపాలకృష్ణ పిలుపు

కడియం  మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. కడియం మండలం వీరవరం గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకుడు రెమ్మళ్ళ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి నాగ శివాజీ, ఎంపీపీ అభ్యర్థి తాడాల రాజరాజేశ్వరి, ఎంపీటీసీ అభ్యర్థి యర్రా నాగదేవి విజయాన్ని కాంక్షిస్తూ గ్రామంలోని పలు ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి వేణు గోపాలకృష్ణ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓట్లు వేసి వైసీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గ్రామస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. గ్రామంలోని ప్రజలతో మమేకమై సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.