వైభవంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు పరిసమాప్తి
విజయనగరం (కల్చరల్), సూర్య : వైభవంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు పరిసమాప్తి. గత నెలరోజులుగా విజయనగరం లో జరిగిన ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలు బుధవారం ఉదయం వనంగుడిలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన చండీ హోమం, పూర్ణాహుతి తో అత్యంత వైభవంగా పరిసమాప్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఎల్ ఏ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ఈ ఉత్సవాలు జయప్రదం గా జరిగేందుకు సహకరించిన వారందరికి అభినందనలు తెలిపారు. అమ్మవారి ఆశీశ్శులు అందరిపై ఉంటాయని అన్నారు. ముందురోజు రాత్రి చదురుగుడిలో ఉయ్యాల కంబాల ఉత్సవం అనంతరం అమ్మవారిని మంగళవాయిద్యాలు తో వనంగుడి కి చేర్చిన తదుపరి దేవస్థానం ఇఓ .కె.శిరీష పర్యవేక్షణలోఆలయ వేదపండితులు ఆతి సాయికిరణ్ శర్మ, తాతా రాజేష్ శర్మ, వీ.నరసింహమూర్తిశర్మ, పర్యవేక్షణలో జగన్నాధాచార్యులు గణపతి పూజ, పుణ్యాహవచనం, అమ్మవారికి స్నపనం, చండీ పారాయణలు, అధ్యాయాలు పూర్తిచేసి కార్యక్రమం పూర్తి స్థాయిలో నిర్వహించారు. మండలదీక్షాధారులు దీక్షలు విరమించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ సిగాదె శ్రీనివాసులు నాయుడు హోటల్ అధినేత బాలాజీ, ఆలయ ప్రధానపూజారి బంటు పల్లి వెంకటరావు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.