శ్రీ వాసవి అమ్మవారి శరన్నవరాత్రి పోస్టర్ ఆవిష్కరణ
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న 23వ శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్‌ను శనివారం ఆవిష్కరణ ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 21 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ అలంకరణల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నారు. లక్ష బిల్వార్చన, లక్ష పుష్పార్చనతో పాటు విద్యార్థులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.విజయదశమి సందర్భంగా 21న ఉదయం 11 గంటలకు అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం 3 గంటల నుంచి మేళతాళాలతో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.కార్యక్రమంలో ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం