BREAKING
కొమురం భీం కుటుంబాన్ని పరామర్శించిన అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత రామాయణంలో కైకేయి పాత్రపై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు: ఆమె లేకపోతే ఆ మహాకావ్యమే లేదన్న నటి! ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు వైద్యుల సేవలకు జర్నలిస్టుల అభినందన - ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం వైద్యుల సేవలకు జర్నలిస్టుల అభినందన..: ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం. టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభలకు ఆహ్వానం. : ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు  ఏర్పాటు టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ నితికా పంత్ ‎ఆదర్శం.... (కథ) ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: అర్ధరాత్రి షోలు, 24 గంటల స్క్రీనింగ్‌లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు! అండర్ 17 రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక అయినా జాహ్నవి ​రైడ్ అమౌంట్ డిస్ప్లేతో పాటు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ ఈషా డియోల్ భావోద్వేగం: ఇండస్ట్రీకి వచ్చి 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరుతో పాటు దివంగత తండ్రి పేరు చేర్చుకున్న నటి మట్టి నమూనా ఆధారంగానే ఎరువులు వాడాలి అక్రమంగా మట్టి, రాళ్ళు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ మంత్రి తుమ్మల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం..* మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు…

​రైడ్ అమౌంట్ డిస్ప్లేతో పాటు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్

Select Suryaa Now
​రైడ్ అమౌంట్ డిస్ప్లేతో పాటు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్

 

​గుంటూరు : పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా రాపిడో కార్మికులకు రేటు కార్డు అమలు చేయాలని గుంటూరు జిల్లా గిగ్ (2 వీలర్స్) వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) గౌరవాధ్యక్షులు బి. ముత్యాలరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయం నుండి రాపిడో కార్యాలయం వరకు కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని రాపిడో గుంటూరు టీం లీడర్ ప్రవీణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాల రావు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతుంటే, మరోవైపు రాపిడో సంస్థ కార్మికులకు ఇస్తున్న రేట్ కార్డును తగ్గించి తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. పెరిగే ధరలకు అనుగుణంగా రేట్లు పెంచకుండా కార్మికుల శ్రమను సంస్థ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కంపెనీ తీసుకువచ్చే కొత్త విధానాలు కార్మికులకు మేలు చేసేలా ఉండాలే తప్ప, వారి పొట్ట కొట్టే విధంగా ఉండకూడదని హితవు పలికారు.రాపిడోలో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి తక్షణమే ఆరోగ్య బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.కార్మికులకు రైడ్‌కు సంబంధించిన పూర్తి అమౌంట్, యాప్‌లో స్పష్టంగా డిస్ప్లే అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేయాలని టీం లీడర్‌ను కోరారు. దీనిపై స్పందించిన టీం లీడర్ ప్రవీణ్, కార్మికుల సమస్యలను కంపెనీ ఉన్నత యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్, నాయకులు జానీ భాష, ఆర్య తదితరులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్