టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ నితికా పంత్
సూర్య సిర్పూర్ (టి):25వ టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ మహా పాదయాత్ర సందర్భంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపిఎస్ టోంకిని ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పూలమాలలతో అలంకరించబడిన శ్రీ సిద్ధి హనుమాన్ స్వామివారికి నమస్కరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం పాదయాత్రకు వస్తున్న లక్షలాది మంది భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఆలయ కమిటీ వారు ఎస్పి నీ శాలువాతో సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఎస్పీ వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్ , ఎస్ఐ ఏ. వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.