సూర్య కరీంనగర్ : ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చింతకుంటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ప్రచారం, రవాణా, ట్రాఫిక్, పార్కింగ్ తదితర అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. నేటి నుంచే గ్రామాలు, పట్టణాల్లో బొట్టు కార్యక్రమం, డప్పు చాటింపు, వాల్ రైటింగ్, కరపత్రాల పంపిణీతో పాటు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా జన సమీకరణ బాధ్యతలను ముఖ్య నాయకులకు అప్పగించారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ కమిషనర్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సభ నిర్వహణకు అనుమతులు కోరుతూ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు లేఖలు అందించాలని నిర్ణయించారు. సభ వరకు ప్రతిరోజూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ రోజువారీ సమీక్ష చేపట్టాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితల సతీష్ కుమార్, రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు, తోట ఆగయ్య, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జడ్పీ చైర్మన్లు తుల ఉమ, దావ వసంత, న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.