telangana
ప్రజలకు కావాల్సింది మాటలు కాదు ఇచ్చిన హామీల అమలు - బిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్
సూర్య కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు అభయాస్తం పేరుతో ప్రజలకు ఆశలు నింపి నేటికీ మూడు సంవత్సరాలు గడుస్తుంది పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు .ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ ముందు అభయస్తం ప్రతులను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు .ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు కావాల్సింది మాటలు కాదు.. ఇచ్చిన హామీల అమలు!మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో పోల్చి, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి.మూడేళ్ల క్రితం అభయహస్తం పేరుతో ప్రజల్లో ఆశలు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేటికైనా మిగిలిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలి.ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు సంపాదించడానికి మాత్రమే కాకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ బిఆర్ఎస్వి అధ్యక్షుడు కుక్క మల్ల నరేష్ రమేష్ , నరసయ్య వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.