సూర్య కరీంనగర్ : యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మహమ్మద్ షానవాజ్ ఉద్దీన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా అధ్యక్షులు జి.వి. రామకిషన్, మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ తదితర ముఖ్య నాయకుల సమక్షంలో మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగూల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మహమ్మద్ షానవాజ్ ఉద్దీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.