సూర్య కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సిరిపురం లావణ్య పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని లావణ్య పేర్కొన్నారు.