telangana
కొమురం భీం కుటుంబాన్ని పరామర్శించిన అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత
సూర్య జైనూర్ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కొమురంభీం మనవడు కొమురం భీంరావు కుటుంబ సభ్యులను మంగళవారం అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత పరామర్శించారు.సిర్పూర్ (యు) మండలంలోని పెద్దదోభా గ్రామానికి చేరుకున్న ఆమె, మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కొమురం సోనేరావు, కొమురం జంగుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.