telangana
వైద్యుల సేవలకు జర్నలిస్టుల అభినందన - ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ రమేష్, కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ కృష్ణంరాజులను తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపింది.అనంతరం ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభలకు వైద్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో నిరంతరం ప్రజలకు వార్తా సేవలు అందించే జర్నలిస్టులకు వైద్యపరమైన సహకారం అందించేలా ఐఎంఏ నాయకులు కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, జిల్లా కోశాధికారి వీ. ప్రశాంత్, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కూమార్,ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, వేణుగోపాల్, జిల్లా కార్యదర్శులు జల్ద మనోజ్, డీఎస్ మధు, సాయిరాజ్ గౌడ్, ప్రసాద్, శ్రీనివాస్,ఇంతయేజ్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.