BREAKING
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 0 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్సి అమలు చేయాలి - మర్రి అవినాష్ కోటంరెడ్డి సోదరులతో భేటీ అయిన మంత్రి ఆనం పేదరికం చదువుకు అడ్డు కాదు - ఒకే కుటుంబంలో ముగ్గురు వైద్యులు ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతులమీదుగా నూతన పెన్షన్ ఉత్తర్వులు పంపిణీ ధారూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీ చైతన్య విద్యార్థి ఎంపిక సగం సీజన్ ముగిసినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరా? - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ – 2026లో అగ్రస్థానాలను కైవసం చేసుకున్న అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

అలుగునూరులో దీక్షా దివస్ భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా కేటీఆర్

Select Suryaa Now
అలుగునూరులో దీక్షా దివస్ భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా కేటీఆర్

సూర్య కరీంనగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక మలుపుగా నిలిచిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 29న కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేసిన అలుగునూరులో దీక్షా దివస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లోని చింతకుంట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉధృతమై, డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రకటన చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో సాగిందన్నారు. దీక్షా దివస్ సందర్భంగా వారం రోజులపాటు వాల్ రైటింగ్, కరపత్రాల పంపిణీ, బొట్టు కార్యక్రమాలు, డప్పు చాటింపు, సోషల్ మీడియా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యోగులు, విద్యావంతులు, అన్ని పార్టీల తెలంగాణ అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు అనుమతుల కోసం కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితల సతీష్ కుమార్, రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తుల ఉమ, దావ వసంత, జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.