BREAKING
ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ప్రజలకు కావాల్సింది మాటలు కాదు ఇచ్చిన హామీల అమలు - బిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలి.. సామాజిక భద్రత కల్పించాలి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ పిలుపు బీఆర్ఎస్‌లో చేరిన మహమ్మద్ షానవాజ్ ఉద్దీన్ విద్యార్థులకు దోమతెరల పంపిణీ దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులపై అవగాహన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిరిపురం లావణ్య నియామకం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన మేయర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాలచెంత కార్తీక దీపోత్సవ కార్యక్రమం - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భట్టిప్రోలు మండలంలో 15 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ --18 నుండి నామినేషన్లు ప్రారంభం: ఎండిఓ వెంకటరమణ. అలుగునూరులో దీక్షా దివస్ భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా కేటీఆర్ ఈ నెల 29న అలుగునూరులో దీక్షా దివస్ సభ ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కొమురం భీం కుటుంబాన్ని పరామర్శించిన అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత రామాయణంలో కైకేయి పాత్రపై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు: ఆమె లేకపోతే ఆ మహాకావ్యమే లేదన్న నటి! ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

వైద్యుల సేవలకు జర్నలిస్టుల అభినందన..: ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం. టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభలకు ఆహ్వానం. :

Select Suryaa Now
వైద్యుల సేవలకు జర్నలిస్టుల అభినందన..:  ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం.  టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభలకు ఆహ్వానం. :

 


1. సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ రమేష్, కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ కృష్ణంరాజులను తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపింది.

అనంతరం ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభలకు వైద్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో నిరంతరం ప్రజలకు వార్తా సేవలు అందించే జర్నలిస్టులకు వైద్యపరమైన సహకారం అందించేలా ఐఎంఏ నాయకులు కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, జిల్లా కోశాధికారి వీ. ప్రశాంత్, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కూమార్,ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, వేణుగోపాల్, జిల్లా కార్యదర్శులు జల్ద మనోజ్, డీఎస్ మధు, సాయిరాజ్ గౌడ్, ప్రసాద్, శ్రీనివాస్,ఇంతయేజ్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.