BREAKING
అక్రమంగా మట్టి, రాళ్ళు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ మంత్రి తుమ్మల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం..* మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు… 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల 29, డిసెంబర్ 2న పోలింగ్: కలెక్టర్ కొద్దిసేపట్లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా ఫోటో స్టూడియో కిష్ట నామినేషన్ దాఖలు. ఉత్తరాంధ్రపై తుఫాను పంజా..! డాక్టర్ మైపతి అరుణ్ కుమార్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దేశ చరిత్రలో తొలిసారి విదేశీ నిందితుడి అప్పగింత.. నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ చరవాణి ద్వారానే.. మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీపీస్  రద్దు చేసి ఒపీస్ పునరుద్ధరించాలి వంజిరి పాఠశాలలో డిజిటల్ తరగతి ప్రారంభం అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు - ప్రజల ఆత్మగౌరవమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం - మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భిక్షాటనలో లింగాల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు

నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ చరవాణి ద్వారానే..

Select Suryaa Now
నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ  చరవాణి ద్వారానే..

 గుంటూరు: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 'ఎరువుల విక్రయాల విధానం' ఫోన్ల ద్వారానే మంగళవారం నుండి  రైతులకు ఎరువుల పంపిణీ జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ సలహాదారు యాష్ తెలిపారు. మంగళవారం ఫిరంగిపురం మండలం నుదురుపా డు గ్రామంలో 'పొలం పిలుస్తోంది'ఈ  కార్యక్రమంలో భాగంగా రైతులు, వ్యవసాయ సహాయకులకు నూతన ఎరువుల పంపిణీ విధానంపై శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయ ఎరువుల విభాగం సంయుక్త సంచాలకులు ఆనంద్ రావు మాట్లాడుతూ నవంబర్ 16 నుంచే ఈ నూతన విధానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. రైతులు తమ చరవాణిలో ఈ అనువర్తనాన్ని దిగుమతి చేసుకుని, తమ భూమి, సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదు మేరకు నత్రజని, భాస్వరం, పొటాష్, మిశ్రమ ఎరువులు కేటాయించబడతా యని, వాటిని రైతులు ఏ ఎరువుల దుకాణం నుంచైనా కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు యాష్ క్షేత్రస్థాయిలో రైతుల ద్వారా ఈ అనువర్తన పనితీరును స్వయంగా పరిశీలించారు. రైతులు తమ రైతు గుర్తింపు సంఖ్య లేదా ఆధార్అనుసంధానమైన చరవాణికి వచ్చే రహస్య సంఖ్య ద్వారా ఎక్కడి నుంచైనా ఎరువులు పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్ రావు మాట్లాడుతూ ఈ నూతన విధానం వల్ల ఎరువులు పక్కదారి పట్టకుండా అర్హులైన రైతులకు పారదర్శకంగా అందుతాయని తెలిపారు. ప్రస్తుతం నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని అధిక నీరు అవసరమ య్యే వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో మంచి దిగుబడులు ఇచ్చే చిరుధాన్యాలు, మినుము, పెసర, కంది, శనగ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. రబీ-26 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద రైతులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని అధికారులు కోరారు. అత్యల్ప ప్రీమియం చెల్లించి సమీపంలోని సామాన్య సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.పెసర: రూ. 45,  జొన్న: రూ. 48, మినుము: రూ. 50, శనగ: రూ. 70, ​మొక్కజొన్న: రూ. 114 లు గా ఉంటుంది. మండల వ్యవసాయ అధికారిణి జే. వాసంతి మాట్లాడుతూ  ప్రస్తుతం పత్తి పంటలో అక్కడక్కడ పచ్చదోమ ఉధృతి కనిపిస్తోందని, దీని నివారణకు రైతులు 'ఉలాలా' లేదా 'ఎసిటామిప్రిడ్' మందులను పిచికారీ చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు సుభాని, హకీమ్, గ్రామ ఉద్యాన సహాయకులు సాంబశివరావు, నుదురుపాడు గ్రామ ఆదర్శ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సూర్య నాయక్