BREAKING
జేమ్స్ బాండ్ పాత్రకు రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపిక: అగ్రశ్రేణి నటుడి నుంచి అభినందనలు, అమూల్యమైన సలహా! కరీనా కపూర్, హృతిక్ రోషన్ మళ్లీ కలుస్తున్నారు: పాతికేళ్ల తర్వాత తెరపై మ్యాజిక్! శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ పై అవగాహన. పవన్ తో నేరుగా మాట్లాడే నేత... సొంత ఊరి లో భంగపాటు సమాచార హక్కు చట్టంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ స్వీట్లపై ప్రమాదకర అల్యూమినియం రేపర్ల వినియోగం.. హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ రేపర్స్ ముఠా గుట్టురట్టు! తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం మంత్రి వాకిటి శ్రీహరి రెవెన్యూ మరియు సర్వే సేవల ప్రగతిపై సమీక్షా సమావేశం సంజీపురం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలక్ష్మి ఘనంగా నామినేషన్ దాఖలు* కోనసీమ జిల్లాలో అదుపులోకి వచ్చిన గ్యాస్ బ్లో అవుట్.. విద్యార్థినులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ జోనల్, రూట్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి ఇళ్ళస్థలాల సాధనకై 20న గ్రేటర్ జర్నలిస్టుల మహా ధర్నా తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం

శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ పై అవగాహన.

Select Suryaa Now
శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ పై అవగాహన.

శ్రీకాళహస్తి ;

శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ విధానంపై రైతు సేవా సిబ్బందికి శిక్షణ. శ్రీకాళహస్తి ప్రాంతంలో నూతన ఎరువులు పంపిణీ విధానంపై శ్రీకాళహస్తి, సత్యవేడు డివిజన్ల పరిధిలోని 9 మండలాలు రైతు సేవా కేంద్ర సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగింది.
ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా రైతులకు ఎరువులు ఎలా బుకింగ్ చేయాలి, క్యూఆర్ కోడ్ ఎలా రూపొందించాలి, రైతులు సులభంగా ఎలా తీసుకోవాలి అనే అంశాలపై సిబ్బందికి సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కార్యాలయం నుంచి సహాయ వ్యవసాయ సంచాలకులు ధనుంజయ రెడ్డి, శ్రీకాళహస్తి సహాయ వ్యవసాయ సంచాలకులు పి.రమేష్ రెడ్డి, సత్యవేడు సహాయ వ్యవసాయ సంచాలకులు సుబ్రమణ్యం హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఇకపై రైతులు యూరియా, డిఏపి వంటి ఎరువులను ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన డిజిటల్ విధానమని పేర్కొన్నారు.
రైతులు తమ చరవాణిలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ను దింపుకొని, వివరాలు నమోదు చేసి లాగిన్ కావాలని సూచించారు. యాప్ ద్వారా కావాల్సిన ఎరువులను బుక్ చేసుకోవచ్చని, బుక్ చేసిన తర్వాత మూడు రోజుల్లోపు ఎరువుల దుకాణం వద్దకు వెళ్లి తీసుకోకపోతే బుకింగ్ రద్దవుతుందని తెలిపారు.
ఈ విధానం వల్ల గతంలో మాదిరిగా ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ సాంకేతిక వ్యవసాయ అధికారి టి. సూర్య ప్రకాశ్ రెడ్డి, నాగలాపురం మండల వ్యవసాయ అధికారి చిట్టిబాబు, పిచ్చాటూరు మండల వ్యవసాయ అధికారి సంజీవరెడ్డి, వరదయ్యపాలెం మండల వ్యవసాయ అధికారి గౌరి, 9 మండలాల రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. 

వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి