సంజీపురం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలక్ష్మి ఘనంగా నామినేషన్ దాఖలు*
బత్తలపల్లి: బత్తలపల్లి మండలం సంజీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సతీష్ సతీమణి శ్రీలక్ష్మి బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో తమ మద్దతుదారులు, సమక్షంలో ఘనంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సంజీపురం పంచాయతీ పరిధిలో సతీష్ కుటుంబానికి ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల వారిని సమానంగా గౌరవిస్తూ, నిత్యం ప్రజలతో కలుపుగోలుగా ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా నిలిచే కుటుంబంగా స్థానికంగా వీరికి మంచి గుర్తింపు ఉంది.
*ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం:* సతీష్
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, శ్రీలక్ష్మిని సర్పంచ్‌గా గెలిపిస్తే సంజీపురం పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల రూపురేఖలు మార్చేలా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. ప్రధానంగా మూడు గ్రామాలకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్, ఆధునిక సౌకర్యాలతో కూడిన స్మశానవాటికల నిర్మాణం, గ్రామాలలో అద్దాల్లాంటి బీటీ మరియు సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు మురుగునీటి పారుదల కోసం డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు ప్రతి వీధిలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి నేరుగా అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామని స్పష్టం చేశారు.
*_ప్రజాసేవే మా కుటుంబ ఊపిరి: సర్పంచ్ అభ్యర్థి శ్రీలక్ష్మి* సర్పంచ్ అభ్యర్థి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా సంజీపురం పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలను నేరుగా కలుసుకొని తమ ప్రచారాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తుందని, ప్రజాసేవే తమ కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, అధికారుల సహకారంతో వాటి శాశ్వత పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల సాధికారతకు, యువత ఉపాధి అవకాశాలకు మరియు రైతుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమకు మద్దతు ఇచ్చి సర్పంచ్‌గా గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.ప్రజల మౌలిక అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మూడు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, మండలంలోనే సంజీపురం పంచాయతీని ఆదర్శంగా నిలపడమే తమ ప్రధాన ధ్యేయమని శ్రీలక్ష్మి, సతీష్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఉన్న ఆదరణ, అన్ని వర్గాల నుంచి లభిస్తున్న అపూర్వ మద్దతుతో ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామనే ధీమాను వారు వ్యక్తం చేశారు.